అహుడ చైర్మన్ టి. సి వరుణ్ ను బుధవారం రాష్ట్ర టీడీపీ నాయకులు కమ్మూరు నాగరాజు దుశ్యాలువతో సన్మానించారు. ఈ మేరకు అనంతపురంలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అహుడా పరిధిలోని ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్య క్రమంలో జనసేన రాప్తాడు ఇన్ఛార్జ్ సాకే పవన్ కుమార్, జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, సాకే నాగరాజు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.