అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుఝామున మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డికి చెందిన ట్రావెల్ బస్సు మంటల్లో దగ్దమైంది. అక్కడ మొత్తం నాలుగు బస్సులను పార్కింగ్ చేయగా అందులో ఒకటి పూర్తిగా దగ్దం కాగా మరొకటి పాక్షికంగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా ఎవరైనా చేసినా పనా అని పోలీసులు విచారిస్తున్నారు.