అనంతపురం: డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి DEO కార్యాలయం వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం DEO ముందు ధర్నా నిర్వహించి డీఈఓకి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జీ రామన్న, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కసాపురం రమేష్, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ ఎస్ ఎఫ్ ఐ జిల్లాఅధ్యక్ష కార్యదర్శి ఒతురు పరమేష్, సిద్దు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు.