అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని పేదలకు ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంపై ఎమ్మెల్యే దగ్గుపాటి అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ పీడీ శైలజ, డీఈ మధుసూదన్ రెడ్డితో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అర్బన్ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే ఎన్ని ఇల్లు నిర్మాణాలు చేపట్టారు. అవి ఏ దశలో ఉన్నాయో అనే అంశాల గురించి ఆరా తీశారు. త్వరలో పరిశీలిస్తానన్నారు