మా అథ్లెటిక్స్ సెలక్షన్ మీట్ 2024-25 పోటీలు ఆదివారం అనంతపురం జేఎన్టీయూ క్రీడా ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 30 సంవత్సరాలు పైబడిన మహిళలు, పురుషుల కోసం పరుగు, స్పీడ్ వాక్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.