రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు అనంతపురం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను విజయవంతం నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. మంగళవారం విజయవాడ నుంచి డిప్యూటీ సీఎం వీసీ నిర్వహించగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.