ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల దాహార్తి తీరుస్తున్న శ్రీ సత్యసాయి తాగునీటి పథకాన్ని జలజీవన్ మిషన్ కింద అనుసంధానం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 19 పథకాల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారని తెలిపారు. వాటి నిర్వహణకు గత ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వకుండా అస్తవ్యస్తంగా మార్చిందని అన్నారు.