అనంతపురం: 13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల ఫయాజ్ అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనపై యునైటెడ్ హార్ట్‌జ్ అసోసియేషన్ తీవ్ర ఖండన వ్యక్తం చేసింది. సంఘ డైరెక్టర్ హాజీ సుహైల్ మాట్లాడుతూ, నేరస్తుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం పోలీసులను శనివారం డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా మద్దతుగా ఉండేందుకు తమ సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ వార్తను లొకల్ యాప్ ఈ ఉదయం మొదటిగా వెలుగులోకి తీసుకొచ్చింది.