అనంతపురం జిల్లాలో "తల్లికి వందనం" పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ పథకం ద్వారా తల్లులైన సంరక్షకులకు ఆర్థిక సహాయం అందించడంతో పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా అభ్యాసం నిర్భందంగా కొనసాగించేందుకు ప్రోత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు.