అనంతపురం: డీఈఓకి యూటీఎఫ్ వినతి

62చూసినవారు
అనంతపురం: డీఈఓకి యూటీఎఫ్ వినతి
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పదవ తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయించాలని అనంతపురంలో డీఈఓ ప్రసాద్ బాబుకు యూటీఎఫ్ జిల్లా నాయకులు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యదర్శి సుబ్బారాయుడు మాట్లాడుతూ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను, ప్రత్యేక అవసరాలు కలిగిన ఉపాధ్యాయులను పదవ తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్