అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా తో 1450 యువతకి మందికి ఉద్యోగాలు సాధించారు. యువతీ యువకులతో కిక్కిరిసిన ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం. 5వేల ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 3500మంది హాజరయ్యారు. ఎమ్మెల్లే మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి 3నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.