అనంతపురం జిల్లాలో మానసిక వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ జే. ఏ. సి రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పి. డి. ఎస్. యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం 9 రకాల పింఛన్లు అందిస్తోందని తెలిపారు. 10వ రకం మానసిక వికలాంగులకు రూ. 15 వేలు పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి. డి. ఎస్. యూ కోశాధికారి శంకర్ పాల్గొన్నారు.