ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తిరుపతి వ్యక్తి వెంకటరమణ 80 మందికి రూ.7 లక్షలు మోసం చేసినట్లు అనంతపురం లోని కక్కలపల్లి కాలనీకి చెందిన సుప్రజ టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. సాయినగర్‌లో జాబ్కాం పేరుతో కార్యాలయం నడుపుతూ వెంకటరమణ మాటలు నమ్మి నిరుద్యోగుల నుంచి డిపాజిట్ పేరిట డబ్బులు వసూలు చేశారు.ఏడాది కావస్తున్నా ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.