మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని అనంతపురం కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలతో ఆయా వర్గాల ప్రజలు ప్రగతిపథంలో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా 477 మంది లబ్ధిదారులకు రూ. 11. 61 కోట్ల మేర స్వయం ఉపాధి పథకానికి మంజూరైన మెగా చెక్కులను జిల్లా కలెక్టర్ అందించారు.