అనంతపురం జిల్లాలో 0 - 6 ఏళ్ల చిన్నారులకు ఆధార్ జనరేషన్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆధార్ డీఎల్ఎంసీ సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 0 - 6 ఏళ్ల చిన్నారులు 75, 287 ఉన్నారని, ఇప్పటి వరకు 5, 798 మందికి ఆధార్ జనరేషన్ పూర్తయిందని తెలిపారు.