ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం అనంతపురంలోని ఆదిమూర్తి నగర్లో ఉన్న జిల్లా హార్టికల్చర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు.