అనంతపురంలోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీని సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు హోన్నూరప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు నబి రసూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం పాఠశాలలోని విద్యార్థులకు సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి? ఈ చట్టం వల్ల కలిగే ఉపయోగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగ పీఠిక పుస్తకాలను పాఠశాల సిబ్బంది, విద్యార్థులకు అందజేశారు.