తనను పెళ్లి చేసుకోవాలని అడిగిందకే నరేశ్ యువతి తన్మయిని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అనంతపురం నగరానికి చెందిన అతను బేల్దారిగా పని చేసేవాడు. రామకృష్ణనగర్లో తన్మయి తల్లిదండ్రులు నిర్మిస్తున్న ఇంటిలో పని చేస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. అప్పటికే నరేశ్‌కు వివాహమైంది. కొద్దిరోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుండడంతో ఎలాగైనా యువతిని వదిలించుకోవాలని ఈ నెల 3న గొట్కూరు వద్ద రాయితో తలపై కొట్టి చంపినట్లుగా సమాచారం.