అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగంలో పరిశోధనలు చేసినందుకు చిన్న దుర్గన్న (జైపాల్) కు శుక్రవారం పి. హెచ్. డి ప్రధానం చేశారు. జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ దివాకర్ పర్యవేక్షకుడిగా, ఎస్కే యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యుడు ఆనంద్ సహ పర్యవేక్షుడిగా వ్యవహరించారు. ఈయన ఇండియా - పాకిస్థాన్ సంబంధాలు, ద్వైపాక్షిక శాంతి ప్రక్రియలో ఒక అధ్యయనం అన్న అంశంపై పరిశోధన చేశారు.