అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సాయంత్రం డీఎల్ఎన్సీ/డీఎల్సీ సమావేశాన్ని జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం కళ్యాణదుర్గం డివిజన్లోని నరసాపురంలో 17. 89 ఎకరాల భూ సేకరణతో పాటు రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయమైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.