అనంతపురం నగరంలోని అనంతపురం ఫిలిం సొసైటీ కార్యాలయంలో గురువారం అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ భాషా ఆధ్వర్యంలో 7 వ లఘు చిత్రోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను అనంతపురం నగరంలోని ప్రముఖులచే విడుదల చేశారు. ఈ వేడుకలను జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు నిర్వహిస్తున్న తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 2వ తేదీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.