మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ గురువారం ప్రజలకు సూచించారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, ఇబ్బందులు కలిగించడం వంటివి చేయరాదన్నారు. కీలక ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుట్రలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.