అనంతపురం మండలం నారాయణపురం గ్రామంలో శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్లే దగ్గుపాటి మాట్లాడుతూ పరిశుభ్రత అన్నది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే వీధి శుభ్రంగా ఉంటుంది. వీధి శుభ్రంగా ఉంటే, ఊరు శుభ్రంగా ఉంటుంది. ఊరు శుభ్రంగా ఉంటే, రాష్ట్రం శుభ్రంగా ఉంటుందన్నారు.