అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గుత్తి లో గురువారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే దగ్గుబాటినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఇరువురు నేతలు కలసి గుత్తి మండలం బేతంచెర్లలో ప్రారంభించనున్న రెన్యూ సోలార్ ప్లాంట్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.