ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆర్.అండ్. బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.