అనంత: శ్రీ త్యాగరాజు సంగీత సభలో పాల్గొన్న ఎంపీ

1159చూసినవారు
అనంత: శ్రీ త్యాగరాజు సంగీత సభలో పాల్గొన్న ఎంపీ
అనంతపురం లో నిర్వహించిన శ్రీ త్యాగరాజు సంగీత సభ 67వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపి అంబికా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సంగీతానికి అందించిన సేవలు స్మరణీయమైనవి.
ఈ సంగీత వారసత్వాన్ని మన చిన్నారులు స్ఫూర్తిగా తీసుకుని అభ్యసించాలి. తల్లిదండ్రులు వారిని సంగీతం, నృత్యం వంటి కళల వైపు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు.

సంబంధిత పోస్ట్