అనంతపురం నగరంలో త్రివిధ దళాలకు మద్దతుగా శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీ లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో మన ఇండియన్ ఆర్మీ శక్తి ఏంటో ప్రపంచమంతా తెలిసింది. పహల్గాం లాంటి సంఘటనలు పునరావృతమైతే, ఆపరేషన్ సిందూర్ లాంటివి కూడా పునరావృతం అవుతాయి అని అన్నారు. ఉగ్రవాదంపై మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు.