అనంతపురం జిల్లా వ్యాప్తంగా జేఎన్టీయూ పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు విద్యార్థులపై ఫీజుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ శుక్రవారం అన్నారు. ప్రభుత్వం వద్ద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. ఫీజు చెల్లింపు కాలపరిమితిని పెంచాలని కోరుతూ రిజిస్ట్రార్ కృష్ణయ్యకి వినతి ఇచ్చారు.