అనంతపురం నగరానికి తాగునీరు అందించే పైప్ లైన్ లీకేజీ కావడంతో జరుగుతున్న మరమ్మతు పనులను శుక్రవారం మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మరమ్మతుల అనంతరం నీటి పరీక్షలు నిర్వహించి, ప్రజలకు నీరు అందించాలని తెలిపారు.