అనంతపురం జిల్లాలోని బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు కూటమి ప్రభుత్వం రూ. 50 లక్షలను మంజూరు చేసిందని ఏపీ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ రమావత్ రమేశ్ నాయక్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించే జయంతి ఉత్సవాల నిర్వహణకు నిధులను మంజూరు చేయడం శుభపరిణామం అన్నారు. ఎస్టీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు.