ఏపీ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన హామీల లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం పట్ల ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ. తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలన్నారు.