అనంతపురం జీఆర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన “శైనింగ్ స్టార్స్-2025” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ వి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తమ ప్రతిభా విద్యార్థులను సత్కరించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెడల్స్, సర్టిఫికెట్లు మరియు రూ. 20,000 చొప్పున చెక్కులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యార్థులు ఇతరులకు ప్రేరణగా నిలవాలని, విద్యపట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.