అనంతపురం జిల్లాలో ఈ నెల 6 నుంచి ఎన్టీఆర్ దివ్యాంగుల పింఛన్లు సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక కార్యక్రమంలో శనివారం తెలిపారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10 వరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తనిఖీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.