విద్యా శాఖలో సమూల మార్పులు తీసుకొస్తామని, 117 జీవోను పూర్తిగా రద్దు చేస్తామని చెప్తూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 పైబడి ఉన్నా కూడా అసంబద్ధంగా యాజమాన్య కమిటీలు సూచనలు తీసుకోకుండా ఉన్నత పాఠశాలలకు విలీనం చేయడం సరైంది కాదని ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ ఆదివారం డిమాండ్ చేశారు. విలీనం విషయంలో విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.