అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణను విద్యార్థి యువజన, ప్రజా సంఘాలు నాయకులు శుక్రవారం కలిశారు. కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకుకు కారణమైన తేజ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే కళాశాల సీజ్ చేసి, సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో పి. డి. ఎస్. యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర, కోశాధికారి బండారు శంకర్, తదితరులు పాల్గొన్నారు.