టీచర్ల బదిలీల చట్టం రూపొందిస్తున్న సందర్భంగా ఒక పాఠశాలలో టీచర్ గరిష్ట సర్వీస్ 8 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు ఉండాలని ఎక్కువ సంఖ్యలో టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్నారు. అందరికీ న్యాయం జరిగేలా టీచర్లతో అభిప్రాయసేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఆదివారం అన్నారు. ప్రధాన ఉపాధ్యాయులకు ఉన్న 5 సంవత్సరాల పరిమితి ఉండాలన్నారు.