అనంతపురం నగరంలోని ఏపీఎన్జీఓ జిల్లా నూతన భవన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఏపీఎన్జీఓలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్య క్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఏపీఎన్జీఓ సంఘం నాయకులు పాల్గొన్నారు.