అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సావిత్రీ బాయి ఫూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. అనంతరం సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే అని కొనియడారు.