తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు బీ. లావణ్య వేణిని గ్రామ, వార్డు సచివాలయం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం కలిశారు. అనంతపురంలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వీ. లక్ష్మినారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని వెల్ఫేర్ ఉద్యోగులుకు ప్రమోషన్లు కల్పించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్ రజాక్, కూన వెంకట సత్యనారాయణ, రమేశ్ పాల్గొన్నారు.