వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మంగళవారం విమర్శించారు. టీటీడీ ఆధ్వర్యంలోని గోశాల నిర్లక్ష్యంతో ఒక్క ఆవు కూడా చనిపోలేదన్నారు. వైసీపీ హయాంలోనే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎంక్వైరీలో తేలిందని తెలిపారు. అసత్య ప్రచారం మానుకోవాలని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో 11వ సీట్లకు పరిమితమైన వైఎస్ జగన్ కు బాగా తెలుసని హితవు పలికారు.