అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అధికారులు యోగాసనాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండేందుకు, మానసిక శాంతికోసం యోగా అవసరమని పేర్కొన్నారు. ప్రతి రోజు యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.