ఆడబిడ్డలను టచ్ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలని సీఎం చంద్రబాబు మంగళవారం అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనలపై సీఎం సమీక్షించారు. యువతి హత్య, అత్యాచారం కేసుల్లో వేగంగా విచారణ చేయాలని ఆదేశించారు. పక్కాగా ఆధారాలు సేకరించి కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. దర్యాప్తు, చర్యల వివరాలను డీజీపీ, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గంజాయి ముఠాల ఆటకట్టించేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నానని సీఎం అన్నారు.