మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా అనంతపురంలోని జడ్పీ కార్యాలయం వద్ద గురువారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫూలే సూచించిన మార్గంలో చంద్రబాబు పాలన సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.