పయ్యావుల కేశవ్ ని కలిసిన ఏపీఎన్జీజీఓ సంఘం సభ్యులు

66చూసినవారు
పయ్యావుల కేశవ్ ని కలిసిన ఏపీఎన్జీజీఓ సంఘం సభ్యులు
అనంతపురం జిల్లా ఏపీఎన్జీజీఓ సంఘము జిల్లా అధ్యక్షులు బి. చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డీ. చంద్రమోహన్, బీ. వెంకటేష్ బాబు, రవి కుమార్, ఎస్. జమీలా బేగం, ప్రవీణ్ కుమార్, టీ. శ్రీనివాస్ కుమార్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్