రాష్ట్ర గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, స్పీకర్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి తదితరులు అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. ప్రముఖుల జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈనెల 17వ తేదీన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, 16వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్న రాకపై సమీక్షీంచారు.