బొమ్మనహాళ్ మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు అరటి, విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. పత్తి పంటలో నీరు చేరి కాయలు రాలి, పత్తి తడిసిపోయింది. బొమ్మనహాళ్ మండలంలోని గోనేహాళ్ గ్రామం వద్ద 10 విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ తో సహా కూలిపోయాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు ఇబ్బంది పడ్డారు.