అనంతపురంలో వర్షానికి నీట మునిగిన కాలనీలు

72చూసినవారు
అనంతపురంలో వర్షానికి నీట మునిగిన కాలనీలు
అనంతపురం జిల్లాలో వర్షానికి నీట మునిగిన కాలనీలు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడంతో పలు ఇళ్లలోకి చేరిన వరద నీరు. దీంతో ప్రజలు అవస్థలు పడ్తున్నారు. అనంతపురం రూరల్ కుక్కలపల్లి కాలనీ, ప్రజాశక్తి నగర్, రాప్తాడు పరిధిలోని కందుకూరు సీపీఐ కాలనీలోకి చేరిన నీరు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. శిల్ప, లేపాక్షి నగర్‌లోనూ ఇళ్లలోకి వరద నీరు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పొంగుతున్న వాగులు, వంకలు.

సంబంధిత పోస్ట్