రేపట్నుండి పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీ కార్యక్రమానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు బస్సులు పంపామని కార్యకర్తలు ఈ బస్సుల ద్వారా కాకినాడకు చేరుకుంటే అక్కడ కాపు కళ్యాణ మండపంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భోజనాల అనంతరం పిఠాపురానికి తరలిరావాలని తెలిపారు.