అనంతపురం కోర్టులో మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నేత చవ్వా రాజశేఖర్ రెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ పోస్టుల వెనుక లోకేశ్ ఉన్నారని ఆరోపించారు.