అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనవరి 9న హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు మేకర్స్ నిర్ణయించినట్లు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇక సీమ గడ్డపై డాకు మహారాజ్ సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.